పీపీపీ అంటే ఏమిటో తెలియని జగన్ రెడ్డి తెలిదు: టిడిపి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గొర్రెపాటి గోపిచంద్
Machilipatnam South, Krishna | Sep 21, 2025
బందరులో వైద్య విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న వైసిపి నాయకులంటూ ఆరోపించిన టిడిపి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గొర్రెపాటి గోపిచంద్ ఆదివారం మద్యాహ్నం 3 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం టిడిపి కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గొర్రెపాటి గోపిచంద్ మిడియాతో మాట్లాడారు. ఓ పక్క మెడికల్ కాలేజ్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతుంటే వందల మంది కాలేజీకి వెళ్లి ఆందోళనలు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. పోలీసులు ఎన్నో రకాలుగా చెప్పినా, జగన్ చెప్పాడని, మెడికల్ కాలేజ్ దగ్గరకు వెళ్లి గందరగోళం సృష్టించారని అగ్రహం వ్యక్తం చేశారు.