సాలూరులో వంద పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని పరీశీలించిన గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి
సాలూరులో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరు పట్టణంలో శరవేగంతో పునఃప్రారంభమౌతున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణన్ని మంత్రి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ 2019లో ఎమ్మెల్సీగా, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంజూరు చేసిందన్నారు. 2019లో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు.