అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ప్రసన్నయిపల్లి రైతు సేవా కేంద్రం వద్ద రైతన్న మీకోసం వారోత్సవాలను బుధవారం మధ్యాహ్నం మూడున్నర నుంచి నాలుగున్నర గంటల వరకు నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి ఏ డి ఏ శైలజ కుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వారికి సబ్సిడీ ధర ఇచ్చే యంత్రాలు ఇతర పరికరాల గురించి రైతులందరికీ అవగాహన కల్పిస్తున్నామని రాప్తాడు మండల వ్యవసాయ శాఖ అధికారి ఏ డి ఏ శైలజ కుమారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.