కామారెడ్డి: చాకలి ఐలమ్మ సేవలు వెలకట్టలేనివి పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
చాకలి ఐలమ్మ సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆమె జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.