అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉరవకొండ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొరకొల్ల డాం కు చెందిన ఎం ఓబుళపతి అనే వ్యక్తి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.