నకలి మద్యం కేసులో నిందితులను పిటి వారెంట్ తొ కోర్టుకు హాజరు పరిచిన పోలీసులు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువు మండలంలో నకిలీ మద్యం తయారీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న నకిలీ మద్యం కేసులో A 1. జనార్దన్ రావు తో పాటు మరో ముగ్గురు ముద్దాయిలను పిటి వారెంట్ తో తంబళ్లపల్లె జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎదుట ముద్దాయిలను పోలీసులు హాజరపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో ముద్దాయిలను మదనపల్లె సబ్ జైలుకు తరలించిన పోలీసులు