మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లోని హసనాబాద్ సమీపంలో టోల్ ప్లాజా సిద్ధమవుతుంది. ఇప్పటివరకు దోర్నాల మండలంలోని శ్రీశైలం రహదారి కర్నూలు రహదారిలో రెండు అటవీ శాఖ చెక్ పోస్టులు పర్యావరణా రుసుము పేరిట వాహనదారుల నుంచి నగదు వసూలు చేస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణం పూర్తి కావడంతో రహదారికి సంబంధించిన టోల్ ప్లాజా హసనాబాద్ సమీపంలో నిర్మాణం చివరి దశకు చేరుకుంది. త్వరలో టోల్ వసూలు ప్రారంభం కానున్నయని అధికారులు తెలిపారు.