సిర్పూర్ టి: చీలపల్లి - లింబుగూడ గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సిర్పూర్ టి మండలం చీలపల్లి లింబుగూడ గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆటో బోల్తా పడిన ఘటనలో సీడం భీమ్రావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో భీంరావు అనే వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి,