పామూరు మండలం బోట్ల గూడూరు గ్రామంలో ఆటో డ్రైవర్ ను స్తంభానికి కట్టేసి కొట్టిన అమానుష సంఘటన శనివారం వెలుగు చూసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద చెర్లోపల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన మహర్షి అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పామూరు మండలం బట్లగూడూరుకు ఆటోతో వెళ్లిన మహర్షి ట్రాఫిక్ రద్దీ ఉండడంతో ఓ బైక్ ను తప్పించే క్రమంలో, బైక్ ను ఢీకొట్టగా ఆ బైక్ వృద్ధుడుపై పడడంతో వృద్ధుడికి గాయాలయ్యాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామానికి చెందిన కొందరు మహర్షిని స్తంభానికి కట్టేసి విచక్షణ రహితంగా కొట్టారు.