అనంతపురం నగరంలోని నడిమి వంక సమీపంలో గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో గుర్తుతెలియని వృద్ధుడికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న అతనిని గమనించిన స్థానికులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.