శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల పరిధిలోని యర్రగుంట పల్లి సమీపంలో జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనాన్ని, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తనకల్లుకు చెందిన షబ్బీర్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం లో అతడిని ఆసుపత్రి కి తరలించారు. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.