కండలేరు డ్యామ్ నిర్వహణ పట్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్న బీజేపీ రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్
Gudur, Tirupati | Nov 17, 2025 తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన కండలేరు జలాశయం మట్టికట్ట అడవిని తలపిస్తోందని బీజేపీ నమామి గంగే, రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ ఆరోపించారు. కండలేరు డ్యామ్ మట్టి కట్టను సోమవారం ఆయన మండల బీజేపీ నేతలతో కలిసి సందర్శించారు. రమేశ్ మాట్లాడుతూ.. కండలేరు డ్యామ్ నిర్వహణ పట్ల అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. డ్యామ్ మట్టికట్ట మెయింటినెన్స్ గాలికి వదిలేశారని ఆరోపించారు.