నాయుడుపేటలో పోలీసుల విస్తృత తనిఖీలు
ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో పోలీసులు గురువారం అణువణువు తనిఖీలు చేపట్టారు. ఎస్సై ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా రైల్వే స్టేషన్లో విస్తృతంగా సోదాలు చేశారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు.