జన్నారం: రానున్న స్థానిక ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సత్తాను చాటాలి: ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయ
గెలుపు,ఓటమిలు అన్నిట్లో సహజమని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయ శంకర్ అన్నారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు రాజకీయాల్లో,ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనని ఓటమిపాలయ్యారని వెనుతిరిగ వద్దని మళ్లీ ప్రయత్నిస్తే లక్ష్యం సాధించవచ్చన్నారు. కావున రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సత్తాను చాటాలని కోరారు.