ధర్మారం: మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన పోలీసులు, నిబంధనలు పాటించాలని సూచన
ధర్మారంలో వివిధ ప్రైవేటు పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సులను ఎస్సై ఎం.ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. డ్రైవర్లు తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ స్పష్టం చేశారు.