అసిఫాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నిరుపేదలకు కనీస నివాస గృహం ఉండాలన్న సంకల్పంతో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలు జిల్లాలో వంద శాతం త్వరగా పూర్తి కావాలని ASF జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అంశం మీద సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ కమిషనర్ గాజానంద్ ఉన్నారు.