అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో రెడ్డిపల్లికి చెందిన దంపతులకు గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.