సంతనూతలపాడు: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నెరవేరియం చేస్తుందని ఆరోపిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంతనూతలపాడు మండలం మైనంపాడు లో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బాబు మాట్లాడుతూ... ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నెరవేర్యం చేస్తుందని, అందులో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చిందన్నారు. ప్రభుత్వ నూతనంగా తీసుకువచ్చిన చట్టం ద్వారా రాష్ట్రాలపై భారాన్ని మోపుతుందని, అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలు ఈ భారాన్ని మోయలేమన్నారు ..