అసిఫాబాద్: ఎకరాకు 7 క్వింటాళ్ల నిబంధన ఎత్తివేయాలి: రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి
ఎకరానికి ఎలాంటి షరతులు లేకుండా 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోళు చేయాలని, కౌలు రైతుల నుంచి ఆధార్ కార్డు ప్రతిపాదికన పత్తిని కొనుగోలు చేయాలని బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మారుతి పటేల్ అన్నారు. బుధవారం ASF జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..జిల్లాలో కాపాస్ కిసాన్ యాప్ వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎకరాకి కేవలం 7 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తే మిగతా పత్తిని ప్రయివేట్ దళారులకు అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారని, కౌలు రైతులు పట్టా పాస్ పుస్తకాలు లేక కాపాస్ కిసాన్ యాప్లో కౌలు రైతుల ఎంపిక లేక ప్రయివేట్ దళారులకు అమ్మి నష్టపోతున్నారన్నారు.