మార్కాపురం: మార్కాపురం జిల్లా ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షునిగా భాష ఎన్నిక
మార్కాపురం జిల్లా ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షునిగా పట్టణానికి చెందిన భాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు రఫీ తెలిపారు. సోమవారం ఒంగోలు ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధికి విద్య ఎంతో అవసరమని ముస్లింల కష్టసుఖాల్లో ముస్లిం సంక్షేమ సంఘం అండగా నిలుస్తుంది అన్నారు. సంఘం అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన భాష కృషి చేయాలని పిలుపునిచ్చారు.