కొత్తగూడెం: కొత్తగూడెంలో సైడ్ కాలువలను పునరుద్ధరించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్ డిమాండ్
కొత్తగూడెం బస్టాండ్ ఏరియా డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు 5అడుగుల సైడ్ కాలువను పునరుద్ధరించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అధికారులను కోరారు. బుధవారం ఆయన కొత్తగూడెం బిఎస్పి పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. గతంలో అధికారులకు ఎన్నోమార్లు వినతి పత్రాలు అందించామన్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు