శ్రీకాకుళం: డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్క పౌరుడు నడుం బిగించాలి: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతీ ఒక్క పౌరుడు నడుం బిగించాలని కేంద్ర పౌర విమాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలిపునిచ్చారు. మహా సంకల్పం దినోత్సవం సందర్బంగా శ్రీకాకుళం నగరంలోని మత్తు వద్దు అను నినాదంతో 5 కేఏం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో గంజాయి వంటి మత్తు పదార్ధాలను నిర్ములించేందుకు పోలీస్ శాఖ సహాయంతో కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతీ పౌరుడు పోలీస్ మాదిరిగా గంజాయిని కూకటి వేల్లతో పెకిలించేందుకు కృషి చేయాలని తెలిపారు.