బంగారుపాలెం మండలం లో ప్యాసింజర్ ఆటోను ఢీకొన్న ఈకో మారుతి సుజుకి వాహనం. తుంబకుప్పం నుండి బంగారుపాళ్యానికి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నల్లంగాడు దగ్గర 6 మంది ప్రయాణికులతో వస్తున్న ఆటోను, ఎదురుగా వస్తున్న ఈకో మారుతి సుజుకి వాహనం డ్రైవర్ అజాగ్రత్తగా మొబైల్ మాట్లాడుతూ, ఢీ కొనడం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు జరిగాయి. పెరుమాళ్ళపల్లి గ్రామానికి చెందిన నలుగురికి, నల్లంగాడు కు చెందిన ఇద్దరికీ తీవ్ర గాయాలు తగిలాయి. స్థానికుల సమాచారం అందుకున్న బంగారుపాళ్యం పోలీసులు, వెంటనే 108 ద్వారా వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసుల సమాచారం మేరకు తెలి