మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. సంక్రాంతి పండగ పురస్కరించుకొని సొంత ఊర్లకు వచ్చిన ప్రజలు తిరిగి తమ విధులకు హాజరయ్యేందుకు పయనమయ్యారు. ఇక్కడి నుండి ఎక్కువగా హైదరాబాదు విజయవాడ గుంటూరు ఒంగోలు కి వెళ్తున్నారు. బస్టాండ్ ప్రాంగణమంతా ఎటు చూసినా రద్దీగా కనిపించింది. ఈ రెండు రోజులు పాటు ప్రత్యేక బస్సులు నడపాలని ప్రయాణికులు కోరారు.