ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహణ జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Nov 14, 2025
ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ పై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ ను షెడ్యూల్ కు అనుగుణంగా నిర్వహించాలన్నారు. ఈనెల 19వ తేదీన నగరంలోని కలెక్టరేట్ నుంచి పీఎస్కే మ్యూజియం వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించాలన్నారు.