అసిఫాబాద్: పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకే వైద్య శిబిరం ఏర్పాటు
మారుమూల గ్రామాలకు చెందిన నిరుపేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రెనిన్ ఆస్పత్రి యజమాన్యం పేర్కొన్నారు. ఈ సందర్భంగా కెరమెరి మండల కేంద్రంలో పాత గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నిరుపేద ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.