అనంతపురం నగరంలో సంచలనంగా డబల్ మర్డర్ కేసు లో నిందితుడైన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య
Anantapur Urban, Anantapur | Mar 28, 2026
అనంతపురం నగరంలో సంచలనంగా మారిన డబుల్ మర్డర్ కేసు కు సంబంధించి నిందితుడైన సద్దల అక్కులప్ప శనివారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అనంతపురం నగరంలో గత కొన్నేళ్ల క్రితం జరిగిన డబుల్ మర్డర్ కేసులో ఇతను నిందితుడుగా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి హియరింగ్ ఉండడంతో మానసిక ఒత్తిడితో ఉరేసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.