ప్రతిపక్షాలు కాంగ్రెస్ సిపిఐ సీపీఎంలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనీ దేశ ప్రధాని మోడీజీ తోనే దేశ అభివృద్ధి సాధ్యం అని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె దేవానంద్, రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో నగరంలోని రోడ్ల భవనాల శాఖ అతిథి గృహం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు, సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ వికసిత భారత్ 2047 లక్ష్యంగా 2025 లో పార్లమెంట్ లో(వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ ఆజీవిక మిషన్ గ్రామీణ) అమోదించబడినది అని, ఇది నిగసిత భారత్ లక్ష్యసాధన దిశలో ఇది ఒక విప్లవాత్మకమైనదన్నారు.