ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తా: నూతన కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్
Machilipatnam South, Krishna | Sep 24, 2025
ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తా: జేసీ నవీన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తానని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ తెలిపారు. బుధవారం మద్యాహ్నం 12 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం కలెక్టరెట్ లొని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. జిల్లాలో భూ సమస్యల పరిష్కారంతో పాటు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.