భీమిలి: జోన్2 మధురవాడ రహదారుల్లో జోన2 టీపీఓ శ్రీ లక్ష్మి ఆధ్వర్యంలో కొనసాగుతున్న జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్
ఆపరేషన్ లంగ్స్ లో భాగంగా మధురవాడ ప్రధాన కూడళ్ళలో బడ్డీలు, రహదారుల్లో ఏర్పాటు చేసిన బోర్డులు తొలగింపు మూడోరోజు శనివారం కొనసాగుతున్నాయి. ఆపరేషన్ లంగ్స్ లో మూడోరోజు జీవీఎంసీ కమీషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలతో జోన్2 కమీషనర్ కే కనకమహాలక్ష్మి సూచనలతో జోన2 పట్టణ ప్రణాళిక విభాగ అధికారిని శ్రీ లక్ష్మీ మొక్కవోణి ధైర్యం తో ఎవరి ప్రలోభాలకు లొంగకుండా సచివాలయం సిబ్బంది సహకారంతో అలుపులేకుండా తొలగింపు చర్యలు చేపడుతున్నారు. మూడు రోజులుగా అధికార కూటమి ప్రభుత్వ నేతల నుండి చిరు వ్యాపారులు నుండి, విపక్షాల నేతల నుండి ప్రజల నుండి వచ్చే ఎన్నో ఓడుదుడుకులను తట్టుకుని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.