చిరస్మరణీయుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి అన్నారు. కళ్యాణదుర్గంలో ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చివరి బొట్టు వరకు కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు.