జిజిహెచ్ ఫోరెన్సిక్ మెడిసిన్ మార్చురీ విభాగానికి డీప్ ఫ్రీజర్ వితరణ : జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Mar 28, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ ఫ్రీజర్ల సదుపాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోబిస్ ఇండియా అధినేతలు జిజిహెచ్ లోని మార్చురీ విభాగానికి అవసరమయ్యే డీప్ ఫ్రీజర్ లను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద అందించారని, మరింతమంది దాతలు ముందుకు వచ్చి జిల్లా పెద్దాసుపత్రి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలిపారు. జిల్లా వాసులకు ఫోరెన్సిక్ సేవలను సమర్థవంతంగా అందిస్తున్న డిపార్ట్మెంట్ ను అభినందించారు.