ట్లైనీ ఐపిఎస్ ఆఫీసర్ అశ్విన్ మణిదీప్ రాయదుర్గం పట్టణంలోని యూపీఎస్ పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. గురువారం మద్యాహ్నం డిఎస్పీ రవిబాబు తో కలసి స్టేషన్ కు వచ్చారు. స్టేషన్ నిర్వాహణ, రికార్డులు పరిశీలించారు. అర్బన్ సిఐ జయనాయక్, రూరల్ సీఐ వెంకటరమణ లకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కర్నాటక సరిహద్దు ప్రాంతంలో నిఘా ఉంచాలని, అసాంఘిక, నేర కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.