పండగపూట గుమ్మగట్ట మండలంలోని దేవిరెడ్డిపల్లి గ్రామం వద్ద విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మారెంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కొత్తపల్లి మారెన్న గొర్రెలలను గురువారం మేపు కోసం తీసుకెళ్లాడు. పొలంలో పురుగు మందు కలిపిన నీటిని తాగి సుమారు 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని విషద్రావకం ప్రభావంతో పడిపోయాయి. సమాచారం అందుకున్న పశువైద్యులు అక్కడికి చేరుకుని చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.