అసిఫాబాద్: ఆసిఫాబాద్ ప్రాముఖ వ్యాపారవేత్త గుండె పోటుతో మృతి
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రాముఖ వ్యాపారవేత్త పాపిని విక్రమ్ కుమార్ శనివారం అర్ధరాత్రి గుండెపోటుకు గురై మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. శనివారం రాత్రి చాతి నొప్పితో బాధపడుతూ స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన ఆయనకు మళ్లీ ఛాతీ నొప్పి రావడంతో ఇంట్లోనే మృతి చెందాడు. దీంతో ఆసిఫాబాద్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.