సంగారెడ్డి: ప్రభుత్వ హాస్టల్ల అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలి : సంగారెడ్డి కలెక్టర్ ప్రావిణ్య
ప్రభుత్వ హాస్టల్లో సౌకర్యాల కల్పనకు అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి బీసీ అభివృద్ధి కార్యాలయం ఆధ్వర్యంలో బాలుర వసతి గృహం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. బాలుర బాలికల వసతి గృహ విద్యార్థులకు తీర్పు సమస్త సహకారంతో స్టీన్లెస్ గ్లాసులు ప్లేట్లను, బ్యాగులు ట్రంక్ పెట్టెలను అడిషనల్ కలెక్టర్ తో కలిసి అందజేశారు.29.89 లక్షలు వెచ్చించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత శాతం పెంచాలని సూచించారు.