రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో గ్రామదట్ల వద్ద శుక్రవారం జరిపిన దాడిలో 8 మంది పేకాటరాయుళ్ళను అరెస్టు చేసినట్లు సిఐ జయనాయక్ తెలిపారు. వారి వద్ద నుండి రూ. 26500 నగదు, 10 బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో 10 మంది పరారిలో ఉన్నారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.