నారాయణపురంలో అన్నదాత సుఖీభవ 2వ విడుత చెక్కును అందజేసిన, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
Anantapur Urban, Anantapur | Nov 19, 2025
అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నారాయణపురం పంచాయతీ పరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నేతలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన 371 మంది రైతులకుగాను 24 లక్షల 73 వేల రూపాయల మెగా చెక్కును రైతులకు ఎమ్మెల్యే అందజేశారు. లబ్ధిదారులకు ట్రాక్టర్, డ్రిప్పులను సబ్సిడీ ద్వారా అందజేశారు.