ఖానాపూర్: ఖానాపూర్ ఎంజేపి పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి సూచనలు చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఖానాపూర్ పట్టణకేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే బాలుర పాఠశాలను సోమవారం ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని కోడి గుడ్లను,పాల పాకెట్స్ ను, కిచెన్ రూమ్ లోని వంట సామగ్రిని పరిశీలించి పిల్లలకు నాణ్యమైన మెను ప్రకారం భోజనం పెట్టాలని,విద్యను పిల్లలకు అర్ధమయ్యే విదంగా బోధించాలని ఎమ్మెల్యే ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎంఎల్ఏ భోజనం చేసి పలు ప్రశ్నలకు విద్యార్థుల వద్ద నుండి సమాధానాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి పదవ తరగతిలో ఉన్నత మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు.