అనంతపురం నగరంలోని రాంనగర్లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.రాయలసీమ పౌరుషంపై జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నా.తాడిపత్రిలో జేసీ 30 ఏళ్ల పాలనకు.. నా ఐదేళ్ల పాలనపై చర్చకు రెడీ. జేసీ ప్రభాకర్ రెడ్డి డేట్ ఫిక్స్ చేయాలన్నారు. కలెక్టర్, ఎస్పీలకు సమాచారం ఇవ్వండి. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైనా చర్చకు సిద్ధం కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.