శ్మశాన స్థల సమస్యను పరిష్కరించాలని MLAకు వినతి
Gudur, Tirupati | Nov 14, 2025 చిట్టమూరు మండలం కోగిలి గ్రామ హరిజనవాడ శ్మశాన దారిని అభివృద్ధి చేయాలని గూడూరులో ఎమ్మెల్యే సునీల్ కుమార్కు శుక్రవారం జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రావు వినతిపత్రం సమర్పించారు. కోగిలి గ్రామంలో మృతి చెందిన వారిని శ్మశానానికి తీసుకెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.