అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీనివాస విద్యానికేతన్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ విశిష్టతను, రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఇంటికి చేరే సందర్భంలో సంక్రాంతి పండుగ జరుపుకుంటామని కరస్పాండెంట్ వేముల శ్రీనివాసులు, హెచ్ఎం సుమ దంపతులు పేర్కొన్నారు. విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శన, తెలుగుదనం ఉట్టిపడేటట్టు ఉండే వారి వేషధారణలు, కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చింది. అదేవిధంగా రంగురంగుల ముగ్గుల హరివిల్లులు కలసి పండుగ వాతావరణాన్ని నింపింది.