అసిఫాబాద్: జానకపూర్ లో పోలీసుల వాహనాల తనిఖీలు
రోడ్డు భద్రత, ప్రజల రక్షణ కోసమే వాహనాల తనిఖీలు చేపట్టినట్లు ASF ఎస్సై శ్యాంరావు అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జానకాపూర్ చౌరస్తా వద్ద పోలీస్ సిబ్బందితో కలసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, నేరాలను,చట్ట ఉల్లంఘనలను అరికట్టడానికి నిత్యం తనిఖీలు జరుగుతాయని ఎస్ఐ తెలిపారు. చట్టబద్ధమైన పత్రాలు ఉన్నవారికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని, లైసెన్స్, హెల్మెట్, సీటు బెల్ట్ వాడకాన్ని పరిశీలిస్తున్నామని, మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.