నిడమానూరు: నీడమనూరు మండల కేంద్రంలోని విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ నిడమానూరు మండల కేంద్రంలోని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పలువురికి మంజూరనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. వర్షాలు నేపథ్యంలో ప్రజలు చెరువులు కుంటలు కాలువల వద్దకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా వరద ఉధృతిని ఎమ్మెల్యే పరిశీలించారు.