కణేకల్లు మండలంలోని 43 కె ఉడేగోళం గ్రామంలో విద్యుత్ మోటార్లు, స్టాటర్, కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. బాదిత రైతులు జిలాన్, వన్నూరస్వామితో పాటు మరో ముగ్గురు సోమవారం మాట్లాడుతూ 7 వ డిస్ట్రిబ్యూటరీ కాలువ కింద ఆయకట్టు పొలాల్లో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దొంగలపై నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.