అసిఫాబాద్: ఆసిఫాబాద్ లో నాసిరకం యాపిల్ పండ్లు
ఆసిఫాబాద్ మార్కెట్లో నాసిరక యాపిల్ పండ్లు అమ్మి ప్రజల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటం ఆడుతున్నారని స్థానికుడు దినకర్ ఆరోపించారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. నాసిరకం యాపిల్ పండ్లు తక్కువ ధరకు తీసుకువచ్చి స్థానికంగా ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్నారు. పండ్లు పైన నిగనిగలాడుతూ..లోపల మాత్రం కుళ్లిపోయి ఉన్నాయని తెలిపారు. ఈ యాపిల్ తింటే మనిషి అనారోగ్యం పడే అవకాశం ఉందన్నారు.