రాజేంద్రనగర్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య ...కేసు నమోదు చేసిన పోలీసులు
అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనస్థలిపురం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మాడ్గుల మండలానికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి (37) తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమ్మగూడలోని యాపిల్ అవెన్యూ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. వేసవి సెలవుల నేపథ్యంలో భార్య, కూతురు ఊరికి వెళ్లారు. అవసరాలకు మించి అప్పులు చేసిన నవీన్ శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదైంది