జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులు అని కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. గురువారం ఉదయం 11 గంటల సమయం లో అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో 2026 - 27వ సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ పంపిణీ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి అర్హత కలిగిన ప్రతి ఒక్క జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.