అసిఫాబాద్: ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై దాడి,ఐదుగురి అరెస్ట్
ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొందగూడ, రౌటాసంకేపల్లి గ్రామానికి చెందిన ప్రహ్లాద్ ఇంటిపై శుక్రవారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న 5గురుని అరెస్ట్ చేసినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. పేకాట ఆడుతున్న 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4.800 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని, నిందితులను ఆసిఫాబాద్ ఠాణాకు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.