విజయనగరం: జగన్ ఒకే ఒక్కడు కాదు నాకున్న ధైర్యం కోట్లమందని సగర్వంగా చెబుతున్నా: చెల్లూరు సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
జగన్ ఒకే ఒక్కడు కాదు నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని సగర్వంగా చెబుతున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం సాయంత్రం చెల్లూరులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డింటింటికీ చేసిన మంచి నాకున్న నమ్మకంపైనున్న దేవుడి దయ. ప్రతీ వర్గానికి మంచి చేసిన న్యాయం చేశాం మనం. మోసం చేసింది మాత్రం వారు. ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్నాం. పేదల్ని ఓడించాలని వారు.. జగన్‌ను గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చార్మిత్రాత్మకం విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా?